న్యూఢిల్లీ: కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ఈ ఉదయం ఢిల్లీలో సైకిల్ తొక్కుతూ ప్రగతి మైదాన్‌కు వెళ్లారు. ప్రగతి మైదాన్‌లో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం కోసం ఆయన అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హాల్ నెంబర్ 11 దగ్గర మీడియాతో మాట్లాడిన మన్సుక్ మాండవీయ.. ఈ రోజు తాను ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం కోసం ఇక్కడికి వచ్చానన్నారు. సైకిల్ వినియోగంవల్ల ఎన్నో లాభాలున్నాయని చెప్పారు. ఫిట్‌గా, హెల్దీగా, బలంగా ఉండటానికి సైకిలింగ్ తోడ్పడుతుందన్నారు.
సైకిలింగ్ను ప్రమోట్ చేయడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సైకిలింగ్ క్లబ్‌లతో కలిసి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. కాగా, మాండవీయ సైకిలింగ్‌తో ప్రజల దృష్టిని ఆకర్షించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఒకసారి ఆయన పార్లమెంట్‌కు కూడా సైకిల్ తొక్కుతూ వెళ్లారు. తనకు సైకిలింగ్ అంటే చాలా ఇష్టమని మంత్రి చెప్పారు.