e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News మ‌రో బాలీవుడ్ న‌టుడికి క‌రోనా పాజిటివ్‌..!

మ‌రో బాలీవుడ్ న‌టుడికి క‌రోనా పాజిటివ్‌..!

మ‌రో బాలీవుడ్ న‌టుడికి క‌రోనా పాజిటివ్‌..!

క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు చాస్తుంది. సెకండ్ వేవ్ మొద‌లు కావ‌డంతో అందరిలో క‌రోనా టెన్ష‌న్ మొద‌లైంది. చిత్ర రంగాన్ని కూడా ఈ మ‌హ‌మ్మారి వ‌ణికిస్తుంది. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో ర‌ణ్‌బీర్ క‌పూర్, సంజ‌య్ లీలా భన్సాలీల‌కు క‌రోనా పాజిటివ్ అని తేల‌గా వారు ప్ర‌స్తుతం  క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక తాజాగా బాలీవుడ్ పాపుల‌ర్ స్టార్ మ‌నోజ్ బాజ్‌పాయ్‌కు సైతం క‌రోనా పాజిటివ్‌గా తేలింది. 

ప్ర‌స్తుతం డెస్పాచ్ అనే షూటింగ్‌లో పాల్గొంటున్న మ‌నోజ్ బాజ్‌పాయ్‌కు వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో టెస్ట్ చేయించుకున్నారు. దీంట్లో పాజిటివ్ అని తేలింది. చిత్ర ద‌ర్శ‌కుడికి కూడా క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయింది. ప్ర‌స్తుతం  వీరిద్ద‌రు హోం ఐసోలేష‌న్‌లో ఉండ‌గా, వైద్యుల సూచ‌న‌ల మేర‌కు మందులు వాడుతున్నారు. మ‌నోజ్ బాజ్‌పాయ్ న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మంచి ఆద‌ర‌ణ పొంద‌గా, ఇప్పుడు దీనికి సీక్వెల్ రూపొందుతుంది. స‌మ్మ‌ర్‌లో ఇది రిలీజ్ కానుంది. స‌మంత ఇందులో నెగెటివ్ పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే .

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మ‌రో బాలీవుడ్ న‌టుడికి క‌రోనా పాజిటివ్‌..!

ట్రెండింగ్‌

Advertisement