దోహా: డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టేబుల్‌టెన్నిస్ (టీటీ) టోర్నీలో భారత్‌కు కాంస్యం దక్కింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్లో మనికా బాత్రా-అర్చనా కామత్ జోడీ 8-11, 6-11, 7-11తో అన్‌సీడెడ్ చైనీస్ తైపీ ద్వయం లియు ఝున్-చెంగ్ఐ చింగ్ చేతిలో ఓడిపోయింది. ప్రత్యర్థికి తొలి గేమ్‌లో పోటీనిచ్చిన మన జోడీ తర్వాతి గేమ్‌ల్లో ప్రతిఘటించకుండానే మ్యాచ్‌ను కోల్పోయింది. సింగిల్స్‌లో కూడా భారత్‌కు నిరాశే మిగిలింది. ప్రిక్వార్టర్స్‌లో సాతియాన్, మనిక ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు.