కావలసిన పదార్థాలు సన్నగా తరిగిన మామిడి పండు, బొప్పాయి పండు ముక్కలు : ఒక కప్పు చొప్పున, పచ్చిమిర్చి : రెండు, కొత్తిమీర తురుము : ఒక టీస్పూన్, వేయించిన పల్లీలు : పావు కప్పు, ఉప్పు : తగినంత, ఆలివ్ ఆయిల్ : రెండు టీస్పూన్లు, మిరియాల పొడి : పావు టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు : నాలుగు, తెల్ల నువ్వులు : రెండు టీస్పూన్లు.
తయారీ విధానం ఒక గిన్నెలో మామిడి, బొప్పాయి ముక్కల్ని వేసి, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, వేయించిన పల్లీలు, తగినంత ఉప్పు, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, తురిమిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి. చివరిగా నువ్వులు వేసి మరోసారి కలుపుకొంటే నోరూరించే మామిడి బొప్పాయి సలాడ్ సిద్ధం.