Smriti Mandhana : మహిళల క్రికెట్లో పరుగుల రాణిగా అవతరించిన స్మృతి మంధాన(Smriti Mandhana) దిగ్గజాలను వెనక్కి నెట్టేసింది. ఆసియా కప్‌లో ఒకేఒక్క మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక రన్స్, ఎక్కువ శతకాలతో రికార్డు నెలకొల్పిన మంధాన.. ఇద్దరి ఆట చూసి తాను స్ఫూర్తి పొందానని చెప్పింది. భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj), ఆస్ట్రేలియా వెటరన్ మేగ్ లానింగ్(Meg Lanning)ల ప్రభావం తనపై ఎంతో ఉందని చెప్పిన మంధాన.. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని అంటోంది.
దుబాయ్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ (Womens Asia Cup)లో శతక్కొట్టిన భారత ఓపెనర్ స్మృతి మంధాన రికార్డుల మోత మోగించింది. శుక్రవారం హాంకాంగ్ చైనా బౌలర్లను బెంబేలెత్తించిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. పరుగుల శిఖరాన్ని అధిరోహించింది. టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును.. అటు మేగ్ లానింగ్ అత్యధిక శతకాల రికార్డను బ్రేక్ చేసిందీ వైస్ కెప్టెన్. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మంధాన ఇది ఆరంభం మాత్రమే అని చెప్పింది. భవిష్యత్‌లో మరిన్ని రికార్డులను తన పేరిట రాసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంది.
🚨 Record Alert 🚨
Smriti Mandhana is now the leading run-getter in women’s internationals 🫡🫡
She surpasses former #TeamIndia captain Mithali Raj 👏👏#WomensAsiaCup | #INDvHK pic.twitter.com/qqxNYJcunz
— BCCI Women (@BCCIWomen) September 3, 2026
Smriti Mandhana, who broke Mithali Raj’s record for most runs and Meg Lanning’s record for most hundreds in women’s internationals, says “it’s just the start” pic.twitter.com/LKKfKK9UgP
— Cricinfo (@cricinfo) September 4, 2026
‘హాంకాంగ్ చైనాతో మ్యాచ్‌లో నేను బ్యాటింగ్‌కు వెళ్లేంత వరకూ అత్యధిక పరుగుల రికార్డు కోసం ఎన్ని రన్స్ చేయాలి? అనేది నాకు తెలియదు. మిథాలీ రాజ్ ఓ లెజెండ్. రోల్ మోడల్ కూడా. మేమంతా ఆమె బ్యాటింగ్ చూస్తూ పెరిగాం. అయితే.. అత్యధిక పరుగులతో మిథాలీ రికార్డును బ్రేక్ చేస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ, ఇప్పుడు టాప్‌లో ఇద్దరు భారతీయులు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 18 సెంచరీలతో మేగ్ లానింగ్(ఆస్ట్రేలియా)ను దాటేయడం చాలా గొప్పగా అనిపిస్తోంది. నా దృష్టిలో 18వ సంఖ్య అనేది చాలా మంచి నంబర్. మహిళల క్రికెట్లో దిగ్గజాలైన మిథాలీ, లానింగ్.. ఆటను చూస్తూ నేను చాలా నేర్చుకున్నా’ అని మంధాన వెల్లడించింది.
The records Smriti Mandhana broke during her regal 124 against Hong Kong, China 👑 pic.twitter.com/4141oDvuhy
— Cricbuzz (@cricbuzz) September 4, 2026
ప్రస్తుతం మంధాన పేరిట మూడు ఫార్మాట్లలో 10,869 పరుగలున్నాయి. మిథాలీ 10,868 రన్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక సెంచరీల విషయానికొస్తే.. మంధాన 18తో అగ్రస్థానంలో ఉండగా.. లానింగ్, లారా వొల్వార్డ్త్ (దక్షిణాఫ్రికా)లు 17 శతకాలతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.