Smriti Mandhana : భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో ఘనత సాధించింది. అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న భారత వైస్ కెప్టెన్ 10 వేల పరుగుల క్లబ్లో చేరింది. అంతర్జాతీయంగా ఈ మైలురాయిని అధిగమించిన నాలుగో క్రికెటర్‌గా, రెండో భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. త్రివేండ్రంలో జరుగుతున్న నాలుగో టీ20లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆమె ఈ క్లబ్లో చేరింది.
ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన రికార్డుల మోత మోగిస్తోంది. వన్డే ప్రపంచకప్ ముందు శతకాలతో హోరెత్తించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒకే ఏడాది అత్యధిక పరుగులతో రికార్డు నెలకొల్పింది. మూడు ఫార్మాట్లలో దూకుడైన ఆటతో చెలరేగే మంధాన 10 వేల పరుగులు పూర్తి చేసుకుంది. ఈ ఘనతను సొంతం చేసుకున్న నాలుగో మహిళా క్రికెటర్‌గా, రెండో ఇండియన్‌గా అవతరించిందామె. మంధాన కంటే ముందు మిథాలీ రాజ్ (Mithali Raj) ఈ క్లబ్లో చేరింది.
Just queen things 👑
Smriti Mandhana becomes the fastest to 10,000 international runs in women’s cricket.#INDvSL 4th T20I, LIVE NOW 👉 https://t.co/Azq3cj5z3w pic.twitter.com/FU2I7De2Na
— Star Sports (@StarSportsIndia) December 28, 2025
ప్రస్తుతం ఈ మాజీ కెప్టెన్ 10,868 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ సీనియర్ ప్లేయర్ సుజీ బేట్స్(10,652 పరుగులు) రెండో స్థానంలో, ఇంగ్లండ్ క్రికెటర్ చార్లొట్టే ఎడ్వర్డ్స్(10,273 పరుగులు) మూడో స్థానంలో ఉన్నారు. 9,301 రన్స్‌తో స్టేఫానీ టేలర్(వెస్టిండీస్) ఐదో ప్లేస్‌లో నిలిచింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మేగ్ లానింగ్ 8,352 పరుగులతో ఆరో స్థానంలో ఉంది.