Film Chamber : తెలుగు సినీపరిశ్రమలో ఆసక్తి రేపిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు(Suresh Babu) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా సూర్యదేవర నాగవంశీ, కార్యదర్శిగా అశోక్ కుమార్, కోశాధికారిగా ముత్యాల రామదాసు ఎన్నికయ్యారు. ప్రొగ్రెస్సివ్ ప్యనెల్ మద్దతుతో సురేశ్ బాబు ఏకగ్రీవంగా అధ్యక్షుడయ్యారు.
ఆదివారం జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ 2025-27 ఎన్నికల్లో ప్రొగ్రెస్సివ్ ప్యానెల్ పైచేయి సాధించింది. ఈ ప్యానెల్ మద్దతుతో నిర్మాత సురేశ్ బాబు అధ్యక్ష పదవి కైవసం చేసుకున్నారు. కొత్తగా ఎంపికైన కార్యవర్గంలో ప్రొగ్రెస్సివ్ ప్యానెల్ నుంచి 31మంది విజయం సాధించగా.. మన ప్యానెల్ నుంచి 17 మంది ఎన్నికయ్యారు.
బ్రేకింగ్ న్యూస్
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక
* ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్
* ఫిలిం ఛాంబర్ వైస్ప్రెసిడెంట్ గా నాగవంశీ,
కోశాధికారిగా ముత్యాల రామదాసు* ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్
* రన్నింగ్… pic.twitter.com/wr86euvlxo— Telugu Feed (@Telugufeedsite) December 28, 2025