అమరావతి : ఏపీలోని నంద్యాల ( Nandyala ) జిల్లాలో ఘోరం జరిగింది. ఇద్దరు పిల్లలను కాలువలో తోసి తల్లి ఆత్మహత్య ( Suicide) చేసుకుంది . జిల్లాలోని గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని ఎస్ఆర్బీసీ కాలువ( SRBC Canel) లో ఒండుట్లకు చెందిన లక్ష్మీదేవి తన పిల్లలు, వైష్ణవి(4), సంగీత ( 5 నెలలు) ను తోసి వేసి ఆమె కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది . సమాచారం అందుకున్న పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబకలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.