లక్నో: హనుమాన్ వేషం వేసిన వ్యక్తి డ్యాన్స్ చేస్తూ వేదికపై కుప్పకూలి మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. సేలంపూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్లకుపైగా వయసున్న రామ్ స్వరూప్, శరన్నవరాత్రుల సందర్భంగా శనివారం రాత్రి హనుమంతుడి వేషం వేశాడు. రామ్ లీలా నాటకాన్ని ప్రదర్శించాడు. లంకా దహనం ఘట్టం సందర్భంగా నిప్పంటించిన తోకతో ఒక బల్లపై డ్యాన్స్ చేశాడు. అయితే గిరాగిరా తిరిగిన అతడు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో డ్యాన్స్ చేస్తున్న బల్ల పైనుంచి కిందపడ్డాడు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, హనుమంతుడి వేషం వేసిన రామ్ స్వరూప్ ప్రదర్శనను చూసేందుకు అతడి భార్య అనుసూయ, రెండేళ్ల కుమార్తె రూప, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారు. డ్యాన్స్ చేస్తూ వేదికపై అతడు మరణించడంతో వారు షాకయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆ గ్రామానికి వెళ్లి ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా, మృతుడు రామ్ స్వరూప్, బండి లాగుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. అతడి మరణంపై విచారం వ్యక్తం చేశారు.
फतेहपुर के धाता में दुर्गा पूजा पंडाल के एक कार्यक्रम में हनुमान की भूमिका निभा रहे 55 साल के रामस्वरूप की मौत, लंकादहन के दौरान चक्कर खाकर मंच से गिरे और चली गई जान @CMOfficeUP @sengarlive @navalkant pic.twitter.com/iR3WZQAlYo
— rishabh mani (@rishabhmanitrip) October 2, 2022