మెల్బోర్న్: దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని పక్కనబెడితే.. సినిమాల్లో మనుషులు దెయ్యాలుగా మారడం చూశాం. అయితే దెయ్యంగా మారిన ఓ కుక్కతో తన పెంపుడు కుక్క ఆటలు ఆడినట్టు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన డిమార్కో అనే వ్యక్తి చెబుతున్నాడు. తన ఇంటి పెరట్లో తన పెంపుడు కుక్కపిల్ల మరో కుక్కతో ఆడుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని ఆయన తెలిపాడు. పూర్తిగా కంచెతో లాక్ చేసిన తన పెరట్లోకి ఇతర జంతువులు వచ్చే ఆస్కారమే లేదంటున్నాడు. అంతేకాదు ఫుటేజీలో కనిపించిన కుక్క పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తున్నదని పేర్కొన్నాడు. తన కుక్క వద్దకు పరుగెత్తుకుని వెళ్లి చూసినప్పుడు.. అదొక్కటే అక్కడ ఉందని, పారదర్శకంగా కనిపించిన కుక్క కచ్చితంగా దెయ్యమేనని వాదిస్తున్నాడు. ఇంటర్నెట్లో ఈ వీడియో వైరల్గా మారింది.