Makthal: తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే చిట్టెం

మక్తల్ రూరల్: మక్తల్ మండలంలో కృష్ణా నది పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
మండలంలోని సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి )బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు రావడంతో గేట్లు ఎత్తి నీటిని వాగులోకి విడుదల చేయడంతో మాగనూర్ వాగు పొంగి ప్రవహిస్తున్నదన్నారు. వాగు పరిసర గ్రామాల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని, వాగు తీరంలో అమర్చుకున్న మోటారు పంపులను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని ఆయన సూచించారు. అలాగే వరదల కారణంగా కృష్ణా నది తీరంలో చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లరాదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

