దేవరకొండ రూరల్, మే 12 : ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం దేవరకొండ పల్లా పర్వత్ రెడ్డి భవన్లో సమ్మెకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి కార్మికులను ఎలాంటి హక్కులు లేకుండా, కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చేస్తుందని దుయ్యబట్టారు.
పార్లమెంట్ సభ్యుల అభిప్రాయం తీసుకోకుండా, ఏకపక్షంగా కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించడంతో యావత్ కార్మిక వర్గం నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయడానికి సన్నద్ధమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నూనె రామస్వామి, జూలూరు వెంకట్ రాములు, నీల వెంకటయ్య, మల్లయ్య, కృష్ణయ్య, సీనయ్య పాల్గొన్నారు.