నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరులోని పీఏసీఎస్ వద్ద మక్కరైతు అవస్థ ఇది. సంచుల కోసం అర్ధరాత్రి నుంచే క్యూలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్న రైతులు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 27: మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. పం డించడానికే కాదు.. అమ్ముకునేందుకూ అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రో జులు, వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. కొనుగోలులో జాప్యం, సంచుల అందజేతలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం పలుచోట్ల రైతు లు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని వ్యవసాయ మారెట్ యార్డులో త్వరగా కాంటా పెట్టడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ – తొర్రూరు ప్రధాన రహదారిపై కర్రలు అడ్డుపెట్టి రాస్తారోకో చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ గేట్ మూసి ఉండటంతో మక్కల లోడ్‌తో వచ్చిన 80 ట్రాక్టర్లు, 20 ఆటోలు మార్కెట్ ఎదుట కిలోమీటర్ మేర బారులుతీరాయి.
ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రైతులు మార్కెట్ ఎదుట రోడ్డుపైనే పడిగాపులుకాశారు. బయ్యారం మండలం కస్తూరినగర్, బయ్యారం, కొత్తపే ట, కంబాలపల్లి, ఉప్పలపాడు, రామచంద్రాపురం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో బస్తా లు లేకపోవడంతో కాంటా నిలిచిపోయింది. ఇనుగుర్తి మండలంలోని మక్కల కొనుగోలు కేంద్రంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మక్కలను తీసుకొచ్చి 20 రోజులు దాటినా నిర్వాహకులు కాంటా పెట్టడంలేదని సీపీఎం, బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతులు ఇనుగుర్తిలో కేసముద్రం- నెల్లికుదురు ప్రధాన రహదారిపై బై ఠాయించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ మార్కెట్ యా ర్డులో హాకా ఫార్మర్ సర్వీస్ సెంటర్‌కు ప్రభు త్వం కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయ గా, ఈ నెల 4న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు.
మండలంలోని పెద్దాపురం, అక్కంపేట, తిరుమలగిరి, కామా రం గ్రామాల రైతులు వారం రోజుల క్రితం మక్కలు తీసుకురాగా, ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని రైతులు మండిపడుతున్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో మకల కొనుగోలు కేంద్రాన్ని ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు కొనుగోలు మొదలు పెట్టకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం ప్రారంభించి దాదాపు 20 రోజులు గడుస్తున్నా బస్తా కూడా తరలించలేదని జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ఈరవెన్నులో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. హనుమకొండ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ రైతు సహకార కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నెల రోజులు కావొస్తు న్నా కాంటా వేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత మండలం చెన్నారావుపేట లో రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు.

మక్కలు నింపడానికి సంచులులేక నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు పీఏసీఎస్ కేంద్రం వద్దే రాత్రిళ్లు నిద్రపోతున్నారు. కూపన్ల కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, దరఖాస్తు జి రాక్స్ పేపర్లను క్యూలో ఉంచి పడిగాపులు కా స్తున్నారు. నెలరోజులుగా కొనుగోలు చేస్తున్న మక్కలను ఎత్తకపోవడంతో అక్కడే కాపలా ఉండాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నా రు. ఈ నెల 20న కూపన్లు అందించినా నేటికీ పూర్తిస్థాయిలో సంచులు అందించలేదని మం డిపడ్డారు. బయోమెట్రిక్‌లో మూడు విధాలు గా కూపన్లు ఇస్తుండటంతో ఎదురుచూపులు తప్పడంలేదని, కొనుగోలు చేసిన మక్కలు ఎత్తడానికి లారీలు, హమాలీల కొరత వేధిస్తున్నదని తెలిపారు.

ప్రభుత్వం రూ.2,400 మద్దతు ధర ఇస్తున్నా సకాలంలో కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు దళారులకు తక్కువకు అమ్ముకుంటున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరులో కొందరు కాంగ్రెస్ నాయకులు రైతుల నుంచి క్వింటాల్‌కు రూ.2,100 చొప్పున కొనుగోలు చేసి వారి గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నట్టు తెలిసింది. రైతుల ఖాతాలో జమైన మద్దతు ధరలో మిగతా డబ్బులు తిరిగి కాంగ్రెస్ నాయకులకు అప్పజెప్పాల్సి వస్తుందని, అలాంటి వారికే సంచుల సరఫరా చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.