హైదరాబాద్, ఏప్రిల్ 27 : రాష్ర్టానికి చెందిన సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్.. రోల్స్-రాయిస్‌తో జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా సిగ్మా ఏరోస్పేస్ సిస్టమ్‌కు సంబంధించిన కీలక విడిభాగాలు తయారు చేయడంతోపాటు సరఫరా చేయాల్సి వుంటుందని పేర్కొంది.
ఈ ఒప్పందం విలువ రూ.3,800 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా రోల్స్-రాయిస్‌తో జట్టుకట్టినట్టు, తద్వారా గ్లోబల్ మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దోహ దం చేయనున్నదని కంపెనీ సీఈవో, ఈడీ సునీల్ కుమార్ తెలిపారు.