న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 : అల్ట్రాటెక్ సిమెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,000 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,474.79 కోట్ల లాభంతో పోలిస్తే రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.25,799 కోట్లకు ఎగబాకింది.