ముంబై, ఆగస్టు 15: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఈవీ మాడల్‌ను పరిచయం చేసింది. వారెన్ బ్రదర్స్‌తో కలిసి తీర్చిదిద్దిన బీఈ 6 బ్యాట్‌మెన్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో కేవలం 300 యూనిట్లు మాత్రమే విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కారు ప్రారంభ ధర రూ.27.79 లక్షలుగా నిర్ణయించింది. ఈ నెల 23న బుకింగ్‌లు ప్రారంభించనున్న సంస్థ…బుకింగ్ చేసుకున్నవారికి వచ్చే నెల 20 నుంచి డెలివరీ చేయనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఎస్‌యూవీల విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మహీంద్రా అడుగులు వేస్తున్నది. ఒకేసారి నాలుగు మాడళ్లను ఆవిష్కరించింది. మాడ్యులర్, మల్టీ-ఎనర్జీ ఎన్యూ-ఐక్యూ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ప్రపంచాన్ని ఆకట్టుకునే నాలుగు ఎస్‌యూవీలను డిజైన్ చేసింది. మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో రూపొందించిన ఈ వాహనాలు రెండేండ్ల తర్వాత అందుబాటులోకి రానున్నాయి.