‘నా ప్రేమను దొంగిలించగలవు, నా స్నేహాన్నీ దొంగిలించగలవు, కానీ నా డబ్బును దొంగిలించలేవు…‘అమ్మాయిని, అప్పిచ్చేవాడ్ని ముద్దుగా చూసుకోవాలి, రఫ్‌గా హ్యాండిల్ చేయకూడదు‘. ‘నేను విన్నాను, నేను ఉన్నాను‘..ఇలాంటి పంచ్ డైలాగ్స్, పవర్ఫుల్ యాక్షన్ సీన్స్‌తో మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ ఆకట్టుకుంది. ‘అప్పనేది ఆడపిల్లలాంటిది సార్, ఇక్కడెవరు బాధ్యతున్న ఆడపిల్ల తండ్రిలా ప్రవర్తించడం లేదు’ వంటి మాస్ డైలాగ్స్‌ను ఫుల్ జోష్‌లో చెప్పారు మహేష్. విలన్లకు మహేష్ ఇచ్చే కౌంటర్స్, కీర్తి సురేష్‌తో చేసిన సరదా మూవ్మెంట్స్, డబ్బు వసూలు చేయడంలో చూపించిన కమిట్మెంట్..ఇవన్నీ ఆయన పాత్రలో కంప్లీట్ హీరోయిజం నింపేశాయి. సోమవారం హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శక నిర్మాతలు పరశురామ్, నవీన్ యేర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ…‘మా సినిమా ట్రైలర్‌కు మీ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. ప్రస్తుతం ట్రైలర్ ఎంజాయ్ చేయండి, సినిమా ఇంతకు వంద రెట్లు ఉంటుంది’ అన్నారు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.