ముంబై: మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కరోనా బారినపడ్డారు. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకున్నానని, అందులో పాజిటివ్ వచ్చిందని పాటిల్ ప్రకటించారు. ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగానే ఉందని, డాక్టర్ల సలహా తీసుకుంటున్నానని చెప్పారు. నాగపూర్, అమరావతి పర్యటనలో, ఇతర కార్యక్రమాల్లో తనపాటు పాల్గొన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈమేరకు దిలీప్ పాటిల్ ట్వీట్ చేశారు.
Maharashtra Home Minister Dilip Walse Patil says he has tested positive for COVID19 with mild symptoms pic.twitter.com/7QSaVepsxB
— ANI (@ANI) October 28, 2021
మహారాష్ట్రలో కొత్తగా 1485 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,03,536కు చేరాయి. ఇందులో 23,096 కేసులు యాక్టివ్గా ఉండగా, 64,43,342 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,40,098 మంది మరణించారు.