
మహబూబ్‌నగర్ టౌన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామాల రూపు రేఖలు మారిపోయాయయని రాష్ట్ర అబ్కారీ, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంతి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పల్లెప్రగతి కింద ఉత్తమ గ్రామపంచాయితీలుగా ఎన్నికైన గ్రామపంచాయితీలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గతంలో ప్రజలు తాగునీరు, విద్యుత్తు వంటి వాటికి ఎన్నో రకాల బాధలను అనుభవించారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ప్రతి ఇంటికి నల్లా, ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమీ, వైకుంఠ ధామా లు, రైతు దేవికలు ఎన్నో సౌకర్యాలు కల్పించామని తెలిపారు. బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఇప్పడు తిరిగి వస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బ్రతుకుకు భరోసా కల్పిస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.

తండాలను గ్రామపంచాయితీలుగా తీర్చిదిద్దిన ఘనత తమదేనని అన్నారు. గ్రామాలలో సమస్యలు పరిష్కారంలో సర్పం చ్‌లు ముందుండాలని కోరారు. అంతేకాక ఉత్తమ గ్రామపంచాయతీగా అవార్డు అందుకున్న గ్రామాలకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు సూచించారు. మొదటి ఉత్తమ గ్రామ పంచాయితీలకు 15వేల రూపాయలు,రెండవ ఉత్తమ గ్రామపంచాయతీలు పదివేలు, మూడవ ఉత్తమ గ్రామ పంచాయతీలకు 5వేలు చొప్పున మంత్రి చెక్కులు అందజేశారు.
అంతేకాక ఓడిఎఫ్ ఫ్లస్ సాధించిన 12 గ్రామపంచాయతీలకు అవార్డులు ప్రదానం చేశారు. అంతకు ముందు పల్లెప్రగతిలో భాగంగా మండ లాల వారీగా చేపట్టిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించి తిలకించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్,స్థానిక సంస్థల తేజస్నంద్లాల్పవార్,ఎంపీపీ, జడ్పీటీసీలు, జడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్డీ యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
