జడ్చర్లటౌన్, మార్చి15: ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని వినియోగదారుల హక్కుల సంస్థ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రీతం అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం జడ్చర్లలోని విశ్వవికాస్ జూనియర్ కళాశాలలో వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో ప్రీతం మాట్లాడారు. విద్యార్థి దశలోనే విద్యార్థులు సామాజిక బాధ్యతను, పౌరుల హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కృష్ణయాదవ్, రూబెన్, కళాశాల ప్రిన్సిపాల్ జానకిరాములుగౌడ్, అధ్యాపకులు వై.ఎస్. ఐజాక్, ఏ.చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.