మహబూబ్‌నగర్ టౌన్, మార్చి 15 : మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మైదానంలో రాష్ట్ర సీనియర్ పురుషుల కబడ్డీ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నది. సోమవారం క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ టోర్నీని ప్రారంభించారు. ఉత్సాహంగా జట్లు పాల్గొంటున్నాయి. మహబూబ్‌నగర్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మ హబూబ్‌నగర్ జట్టు మెదక్‌పై 45-34, కరీంనగర్‌పై 39-10, నల్లగొండపై 45-41 స్కోర్ తేడాతో విజ యం సాధించి సెమీస్‌కు చేరింది. రంగారెడ్డి జట్టు 51-39 స్కోర్‌తో ఖమ్మంపై, నల్గొండ జట్టు 33-32 స్కోర్‌తో హైదరాబాద్‌పై, ఖమ్మం జట్టు 48-35 స్కోర్ తేడాతో నిజామాబాద్‌పై గెలుపొందాయి.
క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని చాటాలని డీవైఎస్వో శ్రీనివాస్ సూచించారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ టోర్నీ రెండో రోజు పోటీలను మంగళవారం డీవైఎస్వో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవలేదని, ఎందరో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో జిల్లా కేంద్రంలో స్టేడియాల అభివృద్ధి జరుగుతున్నదని పేర్కొన్నారు. మైదానాలు పూర్తయితే క్రీడాకారులకు మేలు చేకూరుతుందని చెప్పారు. క్రీడాకారులకు మంచి శిక్షణ అందించే అవకాశం ఉన్నదన్నారు. కార్యక్రమంలో పేట టీఆర్ఎస్ అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, వేణుగోపాల్, గోటూరిశ్రీనివాసులుగౌడ్, నిరంజన్‌రావు, పరశురాం, రమేశ్, రాంచందర్, రాజవర్ధన్‌రెడ్డి, వడెన్న, సోమ్లానాయక్, కురుమూర్తిగౌడ్, శ్రీరాములు, శ్రీనివాసులు, పాపారాయుడు, సాధిక్ అలీ, క్రీడాకారులు పాల్గొన్నారు.