నారాయణపేట టౌన్, మార్చి 15 : డిజిటల్ లావాదేవీలపై కొనసాగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తం చే యాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖ అధికారులపై ఉంద ని కలెక్టర్ హరిచందన అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పట్టణం లోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాణ్యమై న ‘డిజిటల్ ఫైనాన్స్’ అంశంపై మాట్లాడారు. జిల్లాలో చా లా మంది వీధి వ్యాపారస్తులకు క్యూ ఆర్ కోడ్ అందించామని, నగదు రహిత లావాదేవీలు జరిపేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ప్రతినెలా నిర్వహించే మండల మహిళా సమాఖ్య సమావేశాల్లో పాల్గొని న్యాయపరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. కన్జ్యూమార్లు ఇబ్బందులకు గురైతే ఫిర్యాదు చేసేందుకు యాప్‌లు ఉన్నాయని, 180042500333, 1800114000, 733 0774444 నెంబర్‌కు వాట్సప్ నుంచి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కన్జ్యూమర్ ఫోరం అనేది బాధ్యత కలిగిన ఫోరం అని, కంజుమర్ కోర్టుల్లో ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కా రం అయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం వినియోగదారుల శాఖ వాల్ పోస్టర్లను, పుస్తకాలను విడుదల చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, పద్మజారాణి, పౌరసరఫరాల శాఖ అధికారి శివప్రసాద్రె డ్డి, డీఎంహెచ్‌వో రామ్‌మనోహర్‌రావు, జె డ్పీ సీఈవో సిద్ధి రామప్ప, వినియోగదారు ల స్వయం సహాయక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలరాజు, హాజమ్మ, ఆశప్ప తదితరు లు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనుల పరిశీలన
నారాయణపేట రూరల్, మార్చి 15 : మండలంలోని కొల్లంపల్లిలో కొనసాగుతు న్న ఉపాధి హామీ పనులను మంగళవారం కలెక్టర్ హరిచందన పరిశీలించారు. గ్రామంలోని రైతు ఇస్మాయిల్ పొలంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పొలంలో కందకాల పనులను పరిశీలించి కూలీల సంఖ్య పెంచాలని సం బంధిత అధికారులకు సూచించారు. గ్రామాల నుంచి పనులకు రావడానికి ఇబ్బందులు పడుతున్నామని మహిళా కూ లీ కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లో కూలీలను తీసుకెళ్లేందుకు వినియోగించాలని సర్పంచ్ సాయిరెడ్డికి సూచించారు. అలాగే అప్పంపల్లి గ్రామంలో నర్సరీ, డంపింగ్ యార్డులను పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కల తొ లగింపును పరిశీలించి వేసవి కాలం దృష్ట్యా ప్రతిరోజూ వా టికి నీళ్లుపోయాలన్నారు. నర్సరీల్లోని మొక్కలను హరితహారానికి నాటేందుకు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్డీవో గోపాల్‌నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.