నారాయణపేట, మార్చి 9 : నిరుద్యోగ యువతకు సీ ఎం కేసీఆర్ తీపి కబురు అందించారని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి అ న్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బుధవా రం ప్రకటించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అం జలి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జగదీశ్, టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాష్, సీనియర్ నాయకులు చంద్రకాం త్, సుదర్శన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వినోద్‌కుమార్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఊట్కూర్, మార్చి 9 : కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరించేందుకు బుధవారం అసెంబ్లీలో సీ ఎం కేసీఆర్ ప్రకటనపై స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కా ర్యక్రమంలో అధ్యాపకులు శీనురెడ్డి, సత్యనారాయణ, మం జునాథ్, బసయ్య, అశోక్ పాల్గొన్నారు.
తెలంగాణకు దేవుడు సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజల సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తున్న సీఎం కేసీఆర్ దేవుడని జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం లో ఉద్యోగ నియామకాలను సీఎం ప్రకటించగా బుధవా రం మండలకేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున పటాకులు పేల్చి సంబురాలు జరుపుకొన్నారు. ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్ట ణ అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ గోవిందప్ప, మండల కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్హ్రామాన్, ఉపసర్పంచ్ ఇబాదుల్హ్రిమాన్, మహేశ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, తరుణ్ త దితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ భర్తీపై హర్షం
మక్తల్ రూరల్, మార్చి 9 : టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించడంపై మాజీ మార్కెట్ క మిటీ చైర్మన్ నర్సింహగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ జారీ చేయడంతో బుధవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పటాకులు పేల్చి, ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మద్దూర్ మండలంలో…
మద్దూర్, మార్చి 9 : అసెంబ్లీలో ఉద్యోగాలు ప్రకటించిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు,నిరుద్యోగులు బుధవారం క్షీరాభిషేకం చేసి సంబురాలు నిర్వహించారు. పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తాలో పటాకులు కాల్చి, ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సి.వెంకటయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కోస్గి మండలంలో…
కోస్గి, మార్చి 9 : సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. బుధవారం స్థానిక శివాజీ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సం స్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, ఎంపీపీ మధుకర్‌రావు, పీఏసీసీఎస్ వైస్‌చైర్మన్ వేణుగోపాల్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో…
ధన్వాడ, మార్చి 9 : కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించడాన్ని హర్షిస్తూ బుధవా రం మండలకేంద్రంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ముజీబ్, 711 జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్, వరలక్ష్మి, మేరీ, గోపి, సాంబశివుడు, నర్స య్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
నర్వ మండలంలో…
నర్వ, మార్చి 9 : సీఎం కేసీఆర్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం బుధవారం అసెంబ్లీ సాక్షిగా నోటిఫికేషన్ విడుదల చేయడంపై టీఆర్ఎస్ మండల యువ నాయకులు రామన్‌గౌడ్, పాండు, జనార్దన్, జనార్దన్‌రెడ్డి, విజయకుమార్ హర్శం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్ మండలంలో…
మాగనూర్, మార్చి 9 : సీఎం కేసీఆర్ నిరుద్యోగుల్లో కొత్త వెలుగులు నింపేందుకు బుధవారం అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేశారు. మండలకేంద్రంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు వరం
మరికల్, మార్చి 9 : రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటన చేయడంతో నిరుద్యోగులకు వరమని జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ సురేఖారెడ్డి ఆన్నారు. బుధవారం మండలకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశా రు. అనంతరం పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమం లో వైస్‌ఎంపీపీ రవికుమార్ యాదవ్, సర్పంచ్ గోవర్ధన్, మండల కోఆప్షన్ సభ్యుడు మతీన్, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.