
గోపాల్పేట, అక్టోబర్ 29 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్ల లాంటివని స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని బు ద్ధారం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ధర్మ్యా తండా వరకు ఎస్టీఎస్డీఎఫ్ నిధులు రూ.66 లక్షలతో వేసిన 1.9 కిలోమీటర్ల బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఈ రోడ్డు పనులు రెండు నెలల్లోనే పూర్తి చేయడంపై తండావాసులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి డప్పులు, గిరిజన నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు కర్షకుల కుటుంబాలకు భరోసానిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో పథకాలు, అభివృద్ధి పనులు అమలు కానున్నాయని తెలిపారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, రవాణా సదుపాయం మెరుగ్గా ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. అనంతరం గోపాల్‌పేటలో రైతు ఉంద్యాల రాములు మృతి చెంద గా.. అతడి భార్య రాజమ్మకు రైతుబీమా డబ్బులు రూ.5 లక్షలకు సంబంధించిన ప్రొసీడింగ్‌ను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, డీఈ అశోక్, ఏఈ రాజేశ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ పాత్లావత్ హర్యానాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అడ్డాకుల తిరుపతియాదవ్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, సర్పంచులు శంకర్ నాయక్, శేఖర్‌యాదవ్, శ్రీనివాసులు, కోఆప్షన్ సభ్యుడు మతీన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు వంశీనాయక్, మనేశ్బాబు, నాయకులు మంద సత్యశీలారెడ్డి, బిల్లకంటి రాజు, బాల్‌రాజు, మంద కోటీశ్వర్‌రెడ్డి, వెంకటయ్య, విష్ణువర్ధన్‌రావు, పుల్లయ్య యాదవ్, లచ్చగౌడ్, శేషిరెడ్డి, పూల్యానాయక్, రాజు, మల్లయ్య, శివకుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.