
వెల్దండ, అక్టోబర్ 27 : 14ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణకు స్వాతంత్రం తె చ్చిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అ న్నారు. బుధవారం వెల్దండ మండల కొట్ర గేట్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించిన కల్వకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీ రాములుతో కలిసి పాల్గొన్నారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీ జెండా అవిష్కరించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీ మార్గంలో 14 ఏండ్లు పోరాడి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జాతిపితగా నిలిచిండన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు శక్తి అని, కారణజన్ముడని అభివర్ణించారు. జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఎంపీ రాములు మాట్లాడుతూ..60 లక్షల సై న్యం ఉన్న అతి పెద్ద పార్టీ టీఆర్ఎస్ అన్నారు. జాతీయ పార్టీ బీజేపీ దేశానికి ఏం చేసిందో పెట్రోల్, డీజిల్, సిలిండర్‌ను అడిగితే చెబుతాయని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో ప్రజలపై ఎనలేని భారం పడిందన్నారు. పసలేని పా లనకు బీజేపీ నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ బాలాజీసింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోలి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, జెడ్పీటీసీలు భరత్‌ప్రసాద్, దశరథ్‌నాయక్, విజితారెడ్డి, ఎంపీపీలు విజయ, సునీత, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు భాస్కర్‌రా వు, వీరేశంగౌడ్, నారాయణ, దశరథ్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్ గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ సంజీవ్‌యాదవ్, వెల్దండ టీఆర్ఎస్ అధ్యక్షుడు భూపతిరెడ్డి, జయప్రకాశ్, అలీ, ఆర్కే గౌడ్, యాదగిరి, రవీందర్ రావు, బొజ్జయ్య, శ్రీకాంత్ ముదిరాజ్, ప్రదీ ప్ యాదవ్, కౌన్సిలర్లు బాలునాయక్, యాదమ్మ శ్రీనివా స్, మధు, ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు.