
పెబ్బేరు రూరల్, డిసెంబర్ 4 : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రై తులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారుల ను ఆదేశించారు. పెబ్బేరు మండ లం వై.శాఖాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి మంత్రి పల్లెనిద్ర చేశా రు. శనివారం ఉదయం గ్రామంలో ని వీధుల్లో దాదాపు నాలుగు గంట ల పాటు కాలినడక పర్యటించారు. ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదని, దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మంత్రి కి తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్య లు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా మార్కెటిం గ్ అధికారి అనిల్‌ను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్ల తీరును పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు. స మస్యల పరిష్కారానికి పల్లెనిద్రను నిరంతరం కొనసాగించనున్నట్లు వె ల్లడించారు. రామన్‌పాడు కాలువ పై వంతెన నిర్మాణానికి, దళితవాడ లో ఇందిరమ్మ ఇండ్ల స్థానంలో డ బుల్బెడ్రూం ఇండ్ల మంజూరుకు, అంబేద్కర్, వాల్మీకి, మహిళా సం ఘాల భవన నిర్మాణానికి, పాఠశాలలో వంటగది, కంపౌండ్ ఏర్పాటుకు, రోడ్లకు, శాఖాపురం నుంచి రామమ్మపేట రోడ్డు నిర్మాణానికి, దళితవాడలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ తొలగింపు వంటి వా టిని చేపడుతామని మంత్రి తెలిపా రు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, మార్కెట్ కమిటీ చై ర్మన్ శ్యామల, వైస్ ఎంపీపీ బాలచంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులు, నా యకులు పాల్గొన్నారు.
మాజీ సీఎం రోశయ్య మృతికి సంతాపం
వనపర్తి, డిసెంబర్ 4 (నమస్తే తె లంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణంపై మంత్రి నిరంజన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య అంటేనే ఆర్థికశాఖ గుర్తుకు వస్తుందని, ఆ పదవికి ఆయన అంతలా పేరు తెచ్చారని గుర్తుచేశారు.