
గండీడ్, డిసెంబర్ 3 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పలు గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రతిఒక్క రూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అలాగే కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో తాసిల్దార్ జ్యోతి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, డిసెంబర్ 3 : అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఎంపీడీవో జయరాం సూచించారు. శుక్రవారం మండలంలోని కేశ్వాపూర్, కోయిలకొం డ గ్రామాల్లో ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేశారు. గ్రామస్తులందరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని సూ చించారు. కార్యక్రమంలో సర్పంచులు కృష్ణయ్య, మొగుల య్య, డాక్టర్ చంద్రశేఖర్, కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల రూరల్, డిసెంబర్ 3 : మండలంలో కొవిడ్ వ్యా క్సినేషన్ కొనసాగుతున్నది. గంగాపూర్‌లో వ్యాక్సినేషన్ ప్ర క్రియను ఇన్చార్జి ఎంపీడీవో జగదీశ్ పరిశీలించారు. వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
టీకాతోనే రక్ష
రాజాపూర్, డిసెంబర్ 3 : కొవిడ్ వ్యాక్సిన్‌తోనే ప్రాణాలకు రక్షణ ఉంటుందని తాసిల్దార్ శంకర్ పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వ్యాక్సినేష న్ స్పెషల్ డ్రైవ్‌ను పర్యవేక్షించారు. మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి సూచించా రు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, డా క్టర్ ప్రతాప్చౌహాన్, ఖదీర్ పాల్గొన్నారు.
వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి
నవాబ్‌పేట, డిసెంబర్ 3 : మండలంలో ని కొల్లూరులో శుక్రవారం కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయింది. ఈ సందర్భంగా మండల అధికారులు, వైద్యసిబ్బంది, నాయకులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీ వో శ్రీలత, సర్పంచ్ సౌజన్యారఘు, నాయకులు, కార్యదర్శి గంగన్న, ఏఎన్ఎం పుష్పలత, అంగన్వాడీ టీచ ర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
నారాయణపేట టౌన్, డిసెంబర్ 3 : వ్యాక్సిన్‌పై ప్రజల కు అవగాహన కల్పించడంతో వారికి ఉన్న అపోహలు తొలగిపోతాయని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నా రు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ 18 ఏండ్లు పూర్తైన ప్రతిఒక్కరూ వ్యాక్సి న్ వేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు బయటికి వెళ్లిన ప్రతిసారి తప్పనిసరి గా మాస్కులు ధరించాలని, తరచుగా చేతులను శుభ్రపరచుకోవాలన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు.
ముమ్మరంగా వ్యాక్సినేషన్
నారాయణపేట, డిసెంబర్ 3 : పట్టణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. పట్టణంలోని అ న్ని వార్డుల్లో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచ ర్లు శుక్రవారం ఇంటింటికీ తిరుగుతూ వ్యా క్సిన్ వేసుకొని వారిని గుర్తించి అవగాహన కల్పిచడం తో వ్యాక్సిన్ వేస్తున్నారు. మొదటి డోసు వేసుకున్న వారికి కేటాయించిన స మయానికి రెండో డోసు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు పర్యవేక్షణ చేస్తున్నా రు. కార్యక్రమంలో నాయకులు, వైద్య సిబ్బంది, వార్డు వాసులు తదితరులు పాల్గొన్నారు.
టీకా వేయించుకోవాలి
కృష్ణ, డిసెంబర్ 3 : ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మెడికల్ ఆఫీసర్ శ్రీమంత్ అన్నారు. మండలంలోని గుడెబల్లూర్, మూడుమాల, హిందూపూర్ తదితర గ్రామాల్లో శుక్రవారం వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించారు. వైద్య సిబ్బందితో కలిసి గ్రామాల్లో పర్యటించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందిని ఇంతవరకు వ్యాక్సిన్ వేసుకున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకొని వారి ఇండ్ల వద్దకు వెళ్లి టీకా వేశారు. వ్యాక్సిన్ వేసుకునే విధంగా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమం లో గ్రామాల కార్యదర్శులు, వైద్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
తప్పనిసరిగా తీసుకోవాలి
నర్వ, డిసెంబర్ 3 : ప్రజలందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని మండల ప్రత్యేకాధికారి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపీడీవో రమేశ్‌కుమార్‌తో కలిసి నర్వ, సీపూర్ గ్రామాల్లో టీకా కార్యక్రమాన్ని పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధు లు, వైద్య సిబ్బంది వందశాతం టీకా కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలు తప్పనిసరిగా మా స్కు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వైద్య, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకృతి వనం పరిశీలన
సీపూర్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రత్యేకాధికారి శివప్రసాద్‌రెడ్డి, ఎంపీడీవో రమేశ్‌కుమార్ పరిశీలించారు. ప్రకృతి వనంలో ఔషధ, పం డ్ల, పూల మొక్కలతోపాటు గ్రామ అవసరాలకు ఉపయోగపడే మొక్కలను పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రకృతి వనం ఏర్పాటులో ప్రభుత్వం చూయించిన నిబంధనాలను తప్పక పాటించాలన్నారు.