
మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 3 : నం దులు, మౌర్యులు, శాతవాహనులు.. ఇలా ని జాం నవాబుల వరకు పాలించిన మహాద్భుతమైన చరిత్ర మహబూబ్‌నగర్ సొంతం. పట్ట ణం ఏర్పడి నేటికి 131 ఏండ్లు కావస్తున్నది. 6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ పేరు మీద మహబూబ్‌నగర్‌గా నామకరణం చే శారు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అసఫ్‌జా హీ రాజులు 1890 డిసెంబర్ 4న తేదీన మహబూబ్‌నగర్‌గా మార్చారని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటివరకు రుక్కమ్మ పేటగా ఉన్న పేరు మహబూబ్‌నగర్‌గా మారింది. ఆనాడే వి శాలమైన, సుందరభవనాలు నిర్మించబడ్డాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ ఆనాడు నిర్మించినవే. ప్రస్తుత కలేక్టరేట్ భవనం అలీఖాన్ నివాసంగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా పేరొందింది. ని జాం పాలన కోసం నిర్మించిన భవనాలు నేడు జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. కలెక్టరేట్ సముదా య భవనం, తాసిల్దార్ కార్యాలయం, జిల్లా కోర్డు సముదాయం, ఎస్పీ కార్యాలయం, మైన ర్ ఇరిగేషన్ ఈఈ ఆఫీస్, ఫారెస్ట్ కార్యాల యం, పోస్టల్ సూపరింటెండెంట్, డీఈవో కా ర్యాలయం, బాలుర జూనియర్ కళాశాల, ఆర్అండ్బీ ఈఈ కార్యాలయం, జిల్లా జైలు, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, దూద్‌ఖానా, రైల్వేస్టేషన్, ఆర్అండ్బీ అతిథి గృహం తదితర భవనాలు ఉన్నాయి. కాగా, ఆరో నిజాం నవాబ్ మీర్ మ హబూబ్ అలీఖాన్ బహుదూర్ ఫౌండేషన్ వ్య వస్థాపక అధ్యక్షుడు అబ్దుల్హ్రీం ఆధ్వర్యంలో 14 ఏండ్లుగా మహబూబ్‌నగర్ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో అన్ని మతాల పెద్దలు, మేధావులు, రాజకీయ నాయకులను ఆహ్వానించి సత్కరించనున్నట్లు అబ్దుల్ రహీం తెలిపారు.