తమిళనాడులోని ఓ టౌన్‌కి చెందిన శెన్బాకి దక్షిణకొరియా వెళ్లడం ఓ కల. ఆ కలను శెన్బా ఎలా నిజం చేసుకున్నది? అనే ప్రశ్నకు సమాధానమే ‘మేడ్ ఇన్ కొరియా’. ప్రియాంక మోహన్, దక్షిణ కొరియా నటుడు పార్క్ హై-జిన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ విభిన్న కథా చిత్రానికి రా.కార్తిక్ దర్శకుడు. రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 12న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
కొరియన్, తమిళ సంస్కృతుల మధ్య ఉన్న చారిత్రాత్మక అనుబంధాలను ఆవిష్కరించే సినిమా ఇదని దర్శకుడు రా.కార్తిక్ చెప్పారు. శెన్బా అనే అమ్మాయి భావోద్వేగ ప్రయాణమే ఈ సినిమా అని నటి ప్రియాక మోహన్ పేర్కొన్నారు. ఇంకా నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి మోనికా షెర్గిల్ కూడా మాట్లాడారు.