Made in Heaven S2 | Made in Heaven Season 2 | ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ నుంచి వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ (Made in Heaven) వెబ్ సిరీస్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019లో వచ్చిన ఈ సిరీస్ ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పెళ్లిళ్లు స్వర్గంలోనే అవుతాయన్న నానుడినే ఆధారంగా చేసుకొని ప్రముఖ బాలీవుడ్ రైటర్, నిర్మాత జోయా అక్తర్ (Zoya Akthar) ఈ సిరీస్‌ను నిర్మించగా.. వెడ్డింగ్ ప్లానర్స్‌గా మారిన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ల జీవితాల చుట్టూ తిరిగే కథనే ఈ మేడ్ ఇన్ హెవెన్. దీనికి కొనసాగింపుగా సీజన్ 2 (Made in Heaven Season 2) వస్తున్న విషయం తెలిసిందే.. ఆగస్ట్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో సీజన్ 2 స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే సీజన్ 2 వెబ్ సిరీస్ సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ను అందించారు.
మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ 2కు సంబంధించి బ్రైడ్ (వధువు) పాత్రలను మేకర్స్ విడుదల చేశారు. మేడ్ ఇన్ హెవెన్‌లో వధువులుగా.. సీతారామం బ్యూటి మృణాల్ ఠాకూర్, రాధిక అప్టే, షిబానీ దండేకర్, పంజా మూవీ ఫేమ్ సారా జేన్ డయాస్ (Saara jen dias), తదితరులు నటించనున్నట్లు ప్రకటించారు. “మేము వధువులను స్వాగతించడానికి.. మేడ్ ఇన్ హెవెన్‌లో పెళ్లిలకు మళ్లీ హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నామంటూ” మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు.
we’re all set to welcome the brides and attend the Made In Heaven weddings, again✨#MadeInHeavenOnPrime S2, Aug 10@madeinheaventv #ZoyaAkhtar @kagtireema @nitya_mehra @alankrita601 @ghaywan @ritesh_sid @FarOutAkhtar @J10Kassim #AngadDevSingh @vishalrr @excelmovies… pic.twitter.com/kMMDATM8E2
— prime video IN (@PrimeVideoIN) July 30, 2023
మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్‌లో వధువు పాత్రలు ఫేమస్ అన్న విషయం తెలిసిందే. మొదటి సీజన్లో మిర్జాపూర్ ఫేమ్ శ్వేతా త్రిపాఠి (Swetha Tripati), మాన్వి గాగ్రూ, అమృత పూరిలు వధువులుగా నటించగా.. వీరికి మంచి మార్కులు పడ్డాయి.. ఇక రెండో సీజన్లో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రాధిక అప్టే(Radhika Apte), షిబానీ దండేకర్(Shibani Dandekar), సారా జేన్ డయాస్ (Saara jen dias) వధువు పాత్రలో ఎలా చేస్తారని ఫ్యాన్స్ ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
— prime video IN (@PrimeVideoIN) July 30, 2023
— prime video IN (@PrimeVideoIN) July 30, 2023
ఈ సిరీస్‌లో తెలుగు నటి శోభితా దూళిపాళ్ల (Shobitha Dhulipalla)తోపాటు అర్జున్ మాథుర్(Arjun Mathur), కల్కి కొచ్లిన్ (Kalki Koechlin), జిమ్ సర్బా (Jim Sarbh), శశాంక్ అరోరా (Shashank Arora), శివానీ రాఘువన్శి, రసిక దుగ్గల్ (Rasika Duggal) తదితరులు ప్రధానపాత్రలు పోషించారు. ఆగస్ట్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది.