4వేల కోవిడ్ కేర్ కోచ్‌ల్లో 64వేల బెడ్లు : రైల్వే
4వేల కోవిడ్ కేర్ కోచ్‌ల్లో 64వేల బెడ్లు | దాదాపు నాలుగువేల కొవిడ్ కేర్ కోచ్‌ల్లో 64వేల పడకలు అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : దాదాపు నాలుగువేల కొవిడ్ కేర్ కోచ్‌ల్లో 64వేల పడకలు అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం 169 బోగీలను వివిధ రాష్ట్రాలకు అప్పగించగా.. వినియోగించుకుంటున్నట్లు పేర్కొంది. రాష్ట్రాల డిమాండ్ మేరకు ఇండోర్ సమీపంలోని నాగ్‌పూర్, బోపాల్, తిహి కోసం కొవిడ్ కేర్ కోచ్‌లను రైల్వే సమీకరించింది. నాగ్‌పూర్ డివిజన్ రైల్వే మేనేజర్, నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల మధ్య 11 కొవిడ్ కేర్ కోచ్‌ల కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.

రాష్ట్ర డిమాండ్ ప్రకారం.. రైల్వేలు మహారాష్ట్రలోని అజ్ని ఐసీడీ ప్రాంతంలో ఐసోలేషన్ కోచ్‌లను సమీకరిస్తున్నాయి. ఢిల్లీ, యూపీ, ఎంపీ, మహారాష్ట్రలోని మరో తొమ్మిది ప్రధాన స్టేషన్లలో కూడా కోచ్‌లు ఉన్నాయి. మహారాష్ట్రలోని నంద్రుబార్ వద్ద ప్రస్తుతం 57 మంది రోగులు సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. 322 పడకలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలో 1200 పడకల సామర్థ్యం కలిగిన 75 కోవిడ్ కేర్ కోచ్‌ల కోసం రాష్ట్రం పూర్తి డిమాండ్‌ను రైల్వే అందించింది.

50 బోగీలను షకుర్బస్తీ వద్ద 25 కోచ్‌లను ఆనంద్ విహార్ స్టేషన్లలో ఉంచినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌లో పశ్చిమ రైల్వేకు చెందిన రత్లం డివిజన్ ఇండోర్ సమీపంలోని తిహి స్టేషన్లో 320 పడకల సామర్థ్యంతో 20 బోగీలను మోహరించింది. యూపీలో ప్రభుత్వం కోచ్‌లను అభ్యర్థించనప్పటికీ.. ఫైజాబాద్, భడోహి, వారణాసి, బరేలి, నజీబాబాద్ వద్ద ఒక్కొక్కటి పది బోగీలను 50 బోగీల్లో 800 పడకలు అందుబాటులో ఉంచినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
భారత్‌కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కరోనా 617 వేరియంట్లపై కొవాగ్జిన్ ప్రభావవంతం : ఆంథోనీ ఫౌసీ
తెలంగాణకు రెండు రోజులు వర్ష సూచన
కరోనాతో ప్రధాని పిన్ని కన్నుమూత
కెనడాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మృతి
ఈశాన్య భారతాన్ని వణించిన భూకంపం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

