యువతరం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘మ్యాడ్ స్కేర్’. బ్లాక్‌బస్టర్ ‘మ్యాడ్’ సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ నెల 29 శనివారం ఈ సినిమా విడుదల డేట్‌ని మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే.. పంపిణీదారుల కోరిక మేరకు ఒకరోజు ముందుగా.. అంటే, మార్చి 28 శుక్రవారం సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. తాజా నిర్ణయంతో వారాంతంలో భారీ వసూళ్లు రాబట్టడం సులువు అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ విషయంపై చిత్ర సమర్పకుడు సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘మార్చి 29 అమావాస్య. అందుకే పంపిణీదారుల సలహా మేరకు ఒక రోజు ముందుగా మార్చి 28న సినిమాను విడుదల చేయడానికి నిర్ణయించాం. ఈ వేసవిలో అద్భుతమైన నవ్వుల పండుగ రాబోతున్నది. అదే.. ‘మ్యాడ్ స్కేర్’. బ్లాక్‌బస్టర్స్ లక్కీభాస్కర్, డాకూ మహారాజ్‌ల తర్వాత మా సితార సంస్థ నుంచి వస్తున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ పక్కా.’ అని నమ్మకం వెలిబుచ్చారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్‌నితిన్, విష్ణు ఓఐ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శామ్‌దత్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.