కన్నడ హీరో యష్ నటించిన లక్కీ సినిమా ‘లక్కీ స్టార్’ అనే పేరుతో తెలుగులోకి రాబోతున్నది. ఈ చిత్రాన్ని రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ విడుదల చేస్తున్నారు. రమ్య నాయికగా నటించిన ఈ చిత్రానికి డా॥ సూరి దర్శకత్వం వహించారు. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
తాజాగా హైదరాబాద్లో చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ…‘యష్ నటన ప్రధాన ఆకర్షణగా ఈ సినిమా ఉంటుంది. తెలుగులో సొంతంగా విడుదల చేస్తున్నాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా కన్నడలో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు.