లక్నో: దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు 20 లక్షల ఖరీదైన ఎయిర్గన్స్, టెలిస్కోప్, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. చౌదరీ చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వకుండా గ్రీన్ ఛానల్ నుంచి వెళ్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అతని లగేజీలో పది ఎయిర్ గన్స్, గన్స్కు వాడే టెలిస్కోప్ సైట్స్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద సక్రమమైన డాక్యుమెంట్లు లేవని విచారణలో తేల్చారు.