వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం : ఐఎండీ
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం : ఐఎండీ |

న్యూఢిల్లీ : వాయవ్య బంగాళాఖాతం శుక్రవారం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తూర్పు, మధ్యభారతంలోని చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా పశ్చిమ, ఈశాన్య దిశగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. మరో వైపు రాబోయే 24 గంటల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని, ఇందుకు అవసరమైన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పింది.
అల్పపీడనానికి అనుబంధంగా పశ్చిమ గాలులు బలపడడంతో శుక్రవారం నుంచి 15వ తేదీ వరకు మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శనివారం నుంచి 15 వరకు కేరళలో అక్కడక్కడ భారీ వర్షాపాతం ఉంటుందని చెప్పింది. 12-15 కొంకణ్ మీదుగా భారీ వర్షాపాతం ఉంటుందని పేర్కొంది. అలాగే ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, బెంగాల్, జార్ఞండ్, బీహార్‌లో వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని చెప్పింది.
ఇవి కూడా చదవండి..
‘కొవిషీల్డ్’ గ్యాప్ తగ్గింపు!
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
నేటి నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలు..
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం
జమ్మూకాశ్మీర్‌లో అగ్ని ప్రమాదం.. 20 ఇండ్లు దగ్ధం
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో 24 గంటల్లో 91,702 కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

