జోరుగా ఇంక్రిమెంట్లు
- ఈ ఏడాది ఉద్యోగులకు 9 శాతంపైనే
- టాలెంట్‌ను ఒడిసి పట్టేందుకు కంపెనీల వ్యూహం
న్యూఢిల్లీ, మార్చి 2: ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది జోరుగా ఇంక్రిమెంట్లు అందనున్నాయి. పెద్ద ఎత్తున జీతాలను పెంచాలని దేశీయ కంపెనీలు భావిస్తున్నాయి. సగటున 9.1 శాతం పెంపు ఉంటుందని అంచనా. కరోనాకు ముందు 2019లో ఇచ్చిన దానితో పోల్చితే ఇది ఎక్కువే కావడం గమనార్హం. వలసల నేపథ్యంలో ప్రతిభావంతులు చేజారకుండా కంపెనీల వ్యూహంలో భాగంగానే ఈ ఆకర్షణీయ ఇంక్రిమెంట్లు అని డెలాయిట్ టచ్ టోమట్సు ఇండియా (డీటీటీఐ) ఎల్ఎల్పీ నిర్వహించిన ‘2022 వర్క్‌ఫోర్స్ అండ్ ఇంక్రిమెంట్స్ ట్రెండ్స్ సర్వే’ చెప్తున్నది. గతేడాది కూడా ఉద్యోగుల జీతాలను 8 శాతం మేర కంపెనీలు పెంచాయి. ఈ క్రమంలోనే ఈసారి దానికంటే ఒక్క శాతం ఎక్కువే ఇంక్రిమెంట్ ఇవ్వాలని చూస్తున్నట్టు సర్వే అంటున్నది.
మారుతున్న ధోరణి
దేశీయ కార్పొరేట్ల ఆలోచనా ధోరణి ప్రతీ కరోనా వేవ్‌కు మారుతున్నది. 2020లో ఆర్థిక మందగమన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో తక్కువగా జీతాలు పెంచడం, వేతనాల్లో కోతలు పెట్టడం, నియామకాలను నిలిపివేయడం సాధారణంగా కనిపించింది. ఇక 2021లో జీతాల పెంపుండగా, వేతనాల్లో కోతలు ఆగిపోయాయి. పైగా కరోనా ప్రభావిత ప్రయోజనాలను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ ఏడాది నియామకాలు ఊపందుకుంటాయని, వలసలూ బాగానే ఉండొచ్చన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో వలసల్ని నిరోధించేందుకు, ముఖ్యంగా నైపుణ్యం, ప్రతిభ కలిగినవారు వెళ్లిపోకుండా ఆయా సంస్థలు ఇంక్రిమెంట్ల బాట పడుతున్నాయని డీటీటీఐఎల్‌ఎల్‌పీ భాగస్వామి ఆనంద్‌రూప్ ఘోస్ తెలిపారు.
రెండంకెల స్థాయిలో..
ఈసారి సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 34 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు రెండంకెల స్థాయిలో జీతాలను పెంచాలని భావిస్తున్నాయి. 2021లో 20 శాతం, 2020లో 12 శాతంగానే ఈ తరహా సంస్థలున్నాయి. దీంతో ఈ ఏడాది మరింత మంది ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సర్వేలో దాదాపు 450 సంస్థలు పాల్గొన్నాయి. కాగా, గతంతో పోల్చితే ఈ ఏడాది అన్ని ప్రధాన రంగాల్లో జీతాల పెంపు భారీగానే ఉండొచ్చని సర్వే అభిప్రాయపడింది.
లైఫ్‌సైన్సెస్, ఐటీ రంగాల్లో..
లైఫ్‌సైన్సెస్, ఐటీ రంగాల్లోనే ఎక్కువగా ఈ ఏడాది జీతాల పెంపు ఉంటుందని సర్వే చెప్తున్నది. ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఐటీ ఉత్పాదక సంస్థలు, డిజిటల్/ఈ-కామర్స్ కంపెనీలు కూడా రెండంకెల స్థాయిలో తమ ఉద్యోగులకు వేతనాలను పెంచవచ్చని అంచనా. ఇక 92 శాతం సంస్థలు.. ఉద్యోగుల పనితీరు ఆధారంగానే ఇంక్రిమెంట్లు వేయనున్నాయని సర్వే స్పష్టం చేసింది. హోదాలనుబట్టి ఈ పెంపులు ఉండనున్నాయి. పదోన్నతుల విషయంలోనూ ఆయా సంస్థలు టాలెంట్‌కే ప్రాధాన్యత ఇవ్వనున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

