తలలో గులాబీలు, మల్లెలు తురుముకోవడం తరాల నుంచీ తరగని సోకే! కానీ సరస్సులో విరిసి కోవెలలో మెరిసే తామరలు కూడా సొగసరికి సిగసిరిని అద్దుతున్నాయిప్పుడు. అవును ఈ సీజన్ హెయిర్ ైస్టెలింగ్లో లోటస్ల సందడి బాగా కనిపిస్తున్నది. జడ వేసుకున్నామా, ముడి పెట్టుకున్నామా, విరబోసుకున్నామా అన్నదాంతో సంబంధం లేకుండా అన్ని రకాల హెయిర్ ైస్టెల్స్కీ సరిపోయేలా తామర మొగ్గల్ని తలలో తురుముతున్నారిప్పుడు బ్యూటీషియన్లు.
చూడగానే కొత్తగా కనిపించడం, అటు అందానికీ ఏ మాత్రం తీసిపోకుండా ఉండటంతో ఆడవాళ్లనూ బాగానే ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు పెండ్లికూతుళ్ల పూల జడల్లోనూ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. హెయిర్ ైస్టెలింగ్ ప్రత్యేకంగా చేసే వారు లేనప్పటికీ, మనకు మనమే అలంకరించుకునేలా లోటస్ హెయిర్ క్లిప్లు రెడీమేడ్గానూ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి ఇక ముందు తరుణుల కొప్పుల్లో తామరలూ తళుకులీననున్నాయి.