కొత్తగూడెం గణేశ్ టెంపుల్, ఆగస్టు 19 : పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నంబర్ 97ను రద్దు చేయడంతోపాటు విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేసే శక్తి పాలసీని వెనకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు షాహిద్, అజిత్ మాట్లాడుతూ.. సాంకేతిక విద్యాశాఖను నిర్వీర్యం చేసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థులు ఈసెట్ రాసే అర్హత కోల్పోయి, కార్పొరేట్ కంపెనీల్లో అతి తకువ వేతనాలకే పనిచేసే పరిస్థితులు దాపురిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమా విద్యార్థులకు ఎంతో కాలంగా అమలులో ఉన్న లేటరల్ ఎంట్రీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు.