సంగీతం ప్రతి హృదయాన్నీ కదిలిస్తుంది. అందుకే మ్యూజిక్ లవర్స్ స్వరాలను ఇష్టపడినట్టే స్వరమాంత్రికులనూ ప్రేమిస్తారు. ఇటీవల చనిపోయిన అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్కి నివాళులర్పిస్తూ దాలిమి లొహోన్ గొగోయ్ అద్భుతమైన చీరను ఆవిష్కరించింది. మగ్గంపై ఇరవై అడుగుల పొడవైన చీరను రూపొందించింది. సంప్రదాయ ఎరుపు రుంగు గమోసా డిజైన్ల మధ్య జుబీన్ పాడిన పాటలను నే(రా)సింది! జుబీన్ పాటల్లో ప్రజాధరణ పొందిన ఎనిమిది పాటలతో పాటు, తను చెప్పిన ఎనిమిది స్ఫూర్తిమంతమైన మాటలను చీరపై నేసి అభిమానాన్ని చాటుకుంది. అసోం, దిబ్రూగడ్ జిల్లాలోని కొవాంగ్లో నివసించే దాలిమి రూపొందించిన ఈ చీర ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.