కాంగ్రెస్ తీరు హాస్యాస్పదం.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కాంగ్రెస్దిగా చెప్పుకోవడం విడ్డూరం
చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులన్నీ తానే చేసినట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుండడం విడ్డూరంగా ఉందని అన్నారు.
- సనత్‌నగర్ టిమ్స్ సహా అన్ని అభివృద్ధి పనుల్లోనూ కాంగ్రెస్‌ది ఇదే వ్యవహారం
- కాంగ్రెస్ అసత్యాల పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు ఖండన
ఖమ్మం కమాన్‌బజార్, ఆగస్టు 19 : చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులన్నీ తానే చేసినట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. సనత్‌నగర్ టిమ్స్ వైద్యశాల ప్రారంభం విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు ఇదే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. అక్కడ ఆయన గొప్పగా చెప్పుకున్న ఆర్భాటపు మాటలు విడ్డూరాలకే విడ్డూరాలుగా ఉన్నాయని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభివృద్ధి, పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తానే చేసినట్లుగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలను చీటికీమాటికీ నిర్బంధిస్తున్నారని అన్నారు. సనత్‌నగర్ టిమ్స్ నిర్మాణం విషయంలో వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు బయలుదేరిన మాజీ మంత్రులను పోలీసులతో అడ్డుకొని గృహ నిర్బంధం చేయడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని కూల్చడం, ప్రభుత్వ, ప్రైవేటు భూములను కొల్లగొట్టడం, పేదల భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దుకు కుట్రపన్నడం, ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం, పీఆర్సీలు, డీఏలు ప్రకటించకపోవడం, ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం, రైతుబీమా ఎత్తివేయడం, విద్యుత్ కోతలు విధించడం, రైతులకు సకాలంలో సాగునీరు, యూరియా అందించలేకపోవడం వంటివన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు సంసిద్ధులై ఉన్నారని స్పష్టం చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

