సిటీబ్యూరో, జనవరి 8(నమస్తే తెలంగాణ): కరోనా ప్రభావంతో గడిచి న రెండేళ్లలో విద్యుత్ శాఖకు రూ.4300 కోట్ల నష్టం వాటిల్లిందని తెలంగా ణ ట్రాన్స్‌కో, జెన్కో సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధలో శనివారం జరిగిన బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం 16వ మహాసభ, 2022 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో బిల్లింగ్, కలెక్షన్ల పరంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు రూ.4300 కోట్లు నష్టపోయాయన్నారు. సాంకేతికంగా మనం బాగున్నప్పటికీ ఆర్థికంగా దానిని ఉపయోగించుకోలేకపోతున్నామని తెలిపారు.
సంస్థ అభివృద్ధికి సాంకేతికంగా బలంగా ఉంటే సరిపోదని, ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడారు. కరో నా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాల న్నారు. కార్యక్రమంలో బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమార స్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, ప్రతినిధులు యాదగిరి, డాక్టర్ చంద్రుడు, బ్రహ్మేందర్, రవీందర్, అశోక్ పాల్గొన్నారు.