Laxmi Parvati : చంద్రబాబు పుట్టినరోజు వేళ లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నారా కుటుంబ చరిత్ర మొత్తం మోసాలతో కూడుకున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నతండ్రి ఎన్టీఆర్‌పై చెప్పులేసి అవమానిస్తుంటే భువనేశ్వరి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. లోకేశ్‌ను నీ స్థాయి ఎంత..? జగన్ ముందు నువ్వెంత..? అని మండిపడ్డారు. ఈవీఎంల మేనేజ్‌మెంట్‌తోనే లోకేశ్ గెలిచారని ఆరోపించారు.
ఏనాడైనా మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా..? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. మీ అమ్మకు వారంటే అయిష్టమని, అసలు మీ మేనత్తలు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా..? అని వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘ఏనాడైనా అమ్మమ్మా అంటూ నా దగ్గరకు వచ్చావా..? అసలు నా పుట్టిన రోజు ఎప్పుడో నీకు తెలుసా..?’ అని ప్రశ్నించారు. అన్ని పార్టీల్లోనూ తన మనుషులను పెట్టుకుని చంద్రబాబు అడ్డదారుల్లో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. బీజేపీలో, కాంగ్రెస్‌లో, చివరకు కమ్యూనిస్టుల్లో కూడా చంద్రబాబే ఉన్నారని విమర్శించారు.
గత వైసీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం జగన్ చేసిన కృషిని లక్ష్మీపార్వతి కొనియాడారు. 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి మహిళా సాధికారతకు బాటలు వేశారని, నిజమైన నాయకుడు అంటే జగన్‌లా ఉండాలన్నారు.