న్యూఢిల్లీ: అదానీ సంక్షోభం(Adani Issue).. రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శలే.. పార్లమెంట్(Parliament) రెండో దఫా సమావేశాలను మింగేస్తున్నాయి. విపక్ష, అధికార సభ్యులు ఆందోళనలతో .. ఉభయసభల్లోనూ చర్చలు లేకుండాపోతున్నాయి. ఇవాళ కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో మళ్లీ అదే సీన్ రిపీటైంది. అదానీ-హిండెన్‌బర్గ్ రిపోర్టు ఆధారంగా జేపీసీ(JPC) వేయాలని బీఆర్ఎస్(BRS)తో పాటు ఇతర విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభలో, రాజ్యసభలో ఈ అంశాన్ని చర్చించాలని విపక్షాలు పట్టుపట్టాయి. కానీ ప్రభుత్వం మాత్రం తగ్గడం లేదు. దీంతో రెండు సభల్లోనూ గందరగోళం(Chaos) నెలకొన్నది. రెండు సభలను సోమవారానికి వాయిదా వేశారు.
ఇక అధికార పక్షం(Ruling Party) రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. లండన్ వర్సిటీలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపడుతోంది. దేశంలో ప్రజాస్వామ్యం(Democracy) లేదని రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే. అదానీ అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ వ్యాఖ్యలను సాకుగా వాడుకుంటుందని కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆరోపిస్తోంది. రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే అని రూలింగ్ పార్టీ భీష్మించడంతో సభ జరగలేదు.
ఇవాళ ఉదయం లోక్‌సభ(Loksabha)లో కాసేపు ప్రశ్నోత్తరాల సమయం నడిచింది. స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) సభను నడిపంచే ప్రయత్నం చేశారు. కానీ విపక్షాలు నినాదాలను ఆపలేదు. దీంతో స్పీకర్ బిర్లా సభను సోమవారానికి వాయిదా వేశారు.