
భగత్‌సింగ్ వేషంలోఅబీర్ వీడియో వైరల్
ఇంఫాల్: ‘నీకున్న బలంతో జీవితాన్ని గడుపు, నీ నిర్జీవమైన శరీరాన్ని మోసేది ఇతరులు’.. భగత్‌సింగ్ వేషంకట్టిన ఆరేండ్ల అబీర్ త్రిపాఠి పలికిన మాటలు ఇవి. శనివారం మణిపూర్‌లో జరిగిన తీవ్రవాద దాడిలో కర్నల్ విపుల్ త్రిపాఠి దంపతులు, వారి కుమారుడు అబీర్‌తో పాటు నలుగురు జవాన్లు మరణించారు. ఈ నేపథ్యంలో పంద్రాగస్టున పాఠశాలలో అబీర్ భగత్‌సింగ్ వేషం వేసిన కార్యక్రమం వీడియో బయటకు వచ్చింది.