ఫిష్ మార్క్టెట్లలో చాలా వరకు చనిపోయిన చేపలే అమ్ముతారు. బతికిన చేపలు దాదాపు ఎక్కడా అమ్మరు. బతికిన చేపలను అమ్మాలంటే పెద్ద సెటప్పే ఉండాలి. అలాంటి సెటప్ చేసి బతికిన చేపలను అమ్మెటోళ్లు అరుదుగా ఉంటారు. హైదరాబాద్ చైతన్యపురిలో ఓ వ్యక్తి లైవ్ ఫిష్‌ను మన కళ్లముందే నీళ్లలోనుంచి తీసి క్లీన్ చేసి మనకు కావలసిన విధంగా కట్‌చేసి నీట్‌గా ప్యాక్ చేసి ఇస్తాడు. ఇది నచ్చి లైవ్ ఫిష్మార్ట్కు జనం క్యూకడుతున్నారు. కొంచెం రిస్క్ అయినా సరే తాజా చేపల కోసం ఎంతో దూరం నుంచి కూడా ఫిష్మార్ట్కు వస్తున్నారు. మరి ఆ ఫిష్ మార్ట్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం రండి..