‘సాగర్ రోడ్డు నుండి వెంకటరమణ కాలనీకి లింక్ రోడ్డు నిర్మించాలి’
నల్లగొండ పట్టణంలోని 9వ డివిజన్ పరిధిలో సాగర్ రోడ్డు నుండి వెంకటరమణ కాలనీకి లింక్ రోడ్డు నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగర్ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి వెంకటరమణ కాలనీ వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని..
– 100 మీటర్ల మేర ప్రభుత్వ స్థలం కేటాయించి వెంటనే పనులు చేపట్టాలి
– నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్
నల్లగొండ రూరల్, నవంబర్ 03 : నల్లగొండ పట్టణంలోని 9వ డివిజన్ పరిధిలో సాగర్ రోడ్డు నుండి వెంకటరమణ కాలనీకి లింక్ రోడ్డు నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగర్ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి వెంకటరమణ కాలనీ వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం పూర్తికాక పోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాగర్ రోడ్డు నుండి వెంకటరమణ కాలనీ, వసుంధర కాలనీ, పటేల్ నగర్, సూర్యవంశం కాలనీ, చైతన్యపురి కాలనీలకు అనుసంధాన రహదారి లేకపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేవలం 100 మీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపడితే ఈ కాలనీల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

‘సాగర్ రోడ్డు నుండి వెంకటరమణ కాలనీకి లింక్ రోడ్డు నిర్మించాలి’
ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన 100 మీటర్ల మేర స్థలాన్ని కేటాయించి, లింక్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భువనగిరి దేవేందర్, 9వ డివిజన్ కార్పొరేటర్ దీప్లా నాయక్, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, గోపగోని స్వాతి, రాజశేఖర్ గౌడ్, టౌన్ యూత్ వైస్ ప్రెసిడెంట్ వజ్జ శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తయ్య, రావుల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేపా రాంరెడ్డి, గోపగోని యాదయ్య, నరసింహ, మారేష్, సైదులు, దేవరపల్లి ముత్తిరెడ్డి, మాధవరెడ్డి, కన్నెబోయిన రమేష్, కునుకుంట్ల శంకర్, కందుల నరేందర్, మన్నెం రాము, ముత్తిరెడ్డి, మాధవరెడ్డి, నేర్లకంటి సుధాకర్, నీలకంఠం నాగార్జున, లింగస్వామి, మామిడాల కృష్ణ, సురేష్ రెడ్డి, సత్యం, మాకమల్ల శివ, రుద్రాక్ష రవి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సాగర్ రోడ్డు నుండి వెంకటరమణ కాలనీకి లింక్ రోడ్డు నిర్మించాలి’
Frozen Vegetables | ఫ్రాజెన్ (ఘనీభవించిన) కూరగాయలను వాడవచ్చా.. పోషకాలు ఉంటాయా..?
BRS | ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు : గండి యాదగిరి
Bombay High Court: దియా మీర్జా యాడ్‌ను రిస్టోర్ చేయండి.. బాంబే హైకోర్టు ఆదేశాలు
AP News | ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితం.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

