BRS | ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు : గండి యాదగిరి
ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గండి యాదగిరి అన్నారు.
లింగాల గణపురం, నవంబర్, 03 : ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గండి యాదగిరి అన్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కళ్లెం గ్రామ డెయిరీలో 9 మంది డైరెక్టర్లను గెలిపించి ఆ సొసైటీ పై గులాబీ జెండా ఎగరవేయడమే ఇందకు నిదర్శనమని తెలిపారు. మంగళవారం ఆయన ఎమ్మెల్సీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ సందర్భంగా వడిచెర్లలో పట్టభద్రులను కలిసి ఓటును నమోదు చేయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టబద్దరుల ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోనే రైతులు వ్యవసాయం పండుగగా చేసుకున్నారన్నారు. ఎల్ నీనో సాకు చూపుతూ సీఎం రేవంత్ రెడ్డి సాగునీరు అందించలేమని…. కరెంటును సరఫరా చేయలేమని చేతులు ఎత్తడం శోషనీయమన్నారు.
ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు సీఎంగా కేసీఆర్ ఉంటే..ఎల్ నీనో ఏ కాదు ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి అయినా ఎదుర్కొని రైతాంగానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పే వారన్నారు. కరోనా విపత్తు వస్తే అలాంటి క్లిష్ట పరిస్థితులను అధిగమించి రైతులకు రైతుబంధు నిధులను విడుదల చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పట్టవద్రులు ఈ విషయాలను గమనించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వడిచర్ల ఉప సర్పంచ్ గుగ్గిళ్ల శ్రీకాంత్ నాయకులు గండి వరప్రసాద్, దెయ్యాల గణేష్, రేగు అంజయ్య, విజయ్ కుమార్, భాస్కర్, ఆంజనేయులు, శ్రీశైలం, నాగరాజు, యాకన్న, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు : గండి యాదగిరి
Bombay High Court: దియా మీర్జా యాడ్‌ను రిస్టోర్ చేయండి.. బాంబే హైకోర్టు ఆదేశాలు
AP News | ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితం.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్
Abishan Jeevinth | తండ్రి అయిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవింత్.!
Stock Market | స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల జోరు.. కారణాలు ఇవే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

