Bombay High Court: దియా మీర్జా యాడ్‌ను రిస్టోర్ చేయండి.. బాంబే హైకోర్టు ఆదేశాలు
Bombay High Court: భారత్ సెక్యులర్ దేశమని, నటి దియా మీర్జా దీపావళి యాడ్‌ను మళ్లీ రిస్టోర్ చేయాలని బీఎంసీకి బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలని దియా చేసిన యాడ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ముంబై: దీపావళి పండుగపై బాలీవుడ్ నటి దియా మీర్జా చేసిన వీడియోను తొలుత ముంబై మున్సిపాల్టీ వాడుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ వీడియోపై రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేయడంతో దాన్ని డిలీట్ చేశారు. అయితే ఇవాళ ముంబై హైకోర్టు(Bombay High Court) కీలక ఆదేశాలు ఇచ్చింది. దియా మీర్జా యాడ్‌ను బీఎంసీ అకౌంట్లో పునరుద్దరించాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. భారత దేశం సెక్యులర్ దేశమని పేర్కొన్నది. పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని దియా మీర్జా తన వీడియోలో కోరింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఊటంకిస్తూ ఆమె తన వీడియోలో పబ్లిక్ రోడ్లపై బాణాసంచా పేల్చరాదు అని దియా పేర్కొన్నది. ఆ వీడియోపై బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. ముంబై బీజేపీ చీఫ్ అమీత్ సత్నం ఆ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీఎంసీ అకౌంట్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bombay High Court: దియా మీర్జా యాడ్‌ను రిస్టోర్ చేయండి.. బాంబే హైకోర్టు ఆదేశాలు
AP News | ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితం.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్
Abishan Jeevinth | తండ్రి అయిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవింత్.!
Stock Market | స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల జోరు.. కారణాలు ఇవే..!
Shah Rukh Khan | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సంచలనం.. విడుదల ముందే రూ. 800 కోట్ల భారీ బిజినెస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

