విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ టీజర్‌ను నేడు విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్‌జోహార్ గురువారం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘కెమెరా వెనక లైగర్ ప్రపంచాన్ని వీక్షించండి. నేడు ఫస్ట్‌గ్లింప్స్ విడుదల చేస్తాం’ అంటూ ఫొటోలపై వ్యాఖ్యానించారు. ఇందులో ఒక ఫొటోలో కెమెరా లెన్స్ నుంచి తీక్షణంగా చూస్తున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపించనున్నారు. ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్‌టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్‌జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నారు.