హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూలు జిల్లా లక్ష్మాపూర్‌కు చెందిన రాములమ్మ (104) యాభై ఏండ్లుగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తుండటంతో ఆమెను సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఘనంగా సత్కరించారు. ఒక అటెండెంట్‌తో రాములమ్మకు లైఫ్ టైం ఉచితంగా బస్సులో ప్రయాణించేలా బస్‌పాస్ అందజేశారు. ఆర్టీసీ కళాభవన్‌లో మంగళవారం నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో చైర్మన్, ఎండీ పాల్గొని మాట్లాడారు. సంస్థలో ఎంతో కాలంగా సేవలందిస్తున్న ఉద్యోగినులను సత్కరించి, ప్రశంసపత్రాలు అందజేశారు. మహిళ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగినులకు బహుమతులు ప్రదానం చేశారు.